సోమవారం 08 మార్చి 2021
International - Jan 19, 2021 , 03:25:15

సూడాన్‌ ఘర్షణల్లో 129 మంది మృతి

సూడాన్‌ ఘర్షణల్లో 129 మంది మృతి

కైరో: దశాబ్దాల అంతర్యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో అరబ్‌, అరబ్‌ యేతర గిరిజన తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అరబ్‌ రిజీగాట్‌ తెగ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అరబ్‌ యేతర సంప్రదాయ మస్సాలిత్‌ గిరిజనులు పోరాడుతున్నారు. డార్‌ఫుర్‌ రాష్ట్రంలో శుక్రవారం ఈ రెండువర్గాలు ఆయుధాలతో పరస్పరం దాడులకు తెగబడటంతో 129 మంది మరణించగా, 189 మంది గాయపడ్డారు. 


VIDEOS

logo