బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 16:01:12

సముద్ర గర్భంలో కేబుల్స్ ఎందుకుంటాయో తెలుసా?

సముద్ర గర్భంలో కేబుల్స్  ఎందుకుంటాయో తెలుసా?

 హైదరాబాద్ : ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో మెయిల్‌ ఓపెన్‌ చేస్తే, సెకను వ్యవధిలోనే సముద్రాల అవతల అమెరికాలో ఎక్కడో ఉన్న సర్వర్‌కు ఆ సందేశం వెళుతుంది. అంతే వేగంగా డేటా మళ్లీ మీకు చేరుతుంది. మరి అది ఎలా సాధ్యమవుతుంది? అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా కేబుల్‌ వేశారా? క్షణాల్లో సమచారం చేరేందుకు టెక్నిక్ ఏమైనా ఉందా అంటే ఉన్నదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్. ఈ కేబుల్స్ ద్వారానే డేటా ప్రసారం జరుగుతున్నది. ప్రపంచంలో క్షణాల్లో సమాచారం ఎక్కడికైనా చేరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు 99 శాతం సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. వీటిని "సబ్ మెరైన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ " అంటారు.

వేలమైళ్ల దూరం ఈ కేబుల్స్  ఉంటాయి. ఈ లైన్స్ పొడవు ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో దాదాపు 8 వేల అడుగుల లోతులో ఈ కేబుల్స్ ఉంటాయి. మరి ఇంత లోతుల్లోకి కేబుల్స్ వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సమయం చాలా ఎక్కువ అవుతుంది. సముద్రం లోపల వైర్లను ఏర్పాటు చేస్తే వీటికి షార్క్ చేపల రూపంలో ప్రమాదం ముంచుకోస్తున్నది. అవి ఈ కేబుల్స్ ని తమ పదునైన దంతాలతో కొరికివేస్తున్నాయి. దీంతో రిపేరింగ్ తలకు మించిన భారంగా మారుతున్నది. ఈ కేబుల్స్ కు అనుక్షణం ప్రమాదం ముంచుకొస్తూనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు,లాంటి వైపరీత్యాలకు ఇవి నాశనం అవుతున్నాయి.

వీటిని ఓ సారి రిపేర్ చేయాలంలో ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది. విశ్వంలో ఇప్పుడు వేయికు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మార్స్ మీదకు మిషన్ కూడా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ శాటిలైట్లు పంపించే డేటా కన్నా సబ్ మెరైన్ కేబుల్స్ ద్వారా పంపే డేటా చాలా వేగంగా జరుగుతుంది. సముద్రగర్భంలో నుంచి కేబుల్‌ వేసే ముందు ఏ మార్గంలో వేయాలో చెక్‌ చేస్తారు. ఒకసారి కేబుల్‌ వేస్తే కనీసం 25 ఏండ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ముందుగా కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. దాదాపు 4 వేల మైళ్లు పరిచేందుకు సరిపోయే కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. అంటే 3500 మెట్రిక్‌ టన్నుల బరువుతో సమానం.logo