బుధవారం 27 మే 2020
International - May 07, 2020 , 14:58:42

వుహాన్‌లో తెరుచుకొన్న పాఠశాలలు

వుహాన్‌లో తెరుచుకొన్న పాఠశాలలు

తొలి కరోనా వైరస్‌ పేషెంట్‌ బయటపడిన చైనా హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. చాలా కాలంపాటు మూతపడిన దుకాణాలు తెరుచుకోగా.. పాఠశాలలు ఇప్పడిప్పుడే మొదలవుతున్నాయి. తొలుత ప్లస్‌ టు విద్యార్థులకు, అనంతరం హైస్కూల్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు స్కూల్‌కు రాగానే వారికి శానిటైజర్‌ అందించి శరీర ఉష్ణోగ్రతలు కొలువడం, తరగతి గదుల్లో నిర్ణీత దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టడం, మధ్యాహ్నభోజనం పాఠశాలలే అందివ్వడం వంటి చర్యలు చేపట్టారు. 

బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకొంటాయని అధికారులు ప్రకటించగా.. గురువారం నాడు హైస్కూల్‌ విద్యార్థులు చాలా పలుచగా హాజరయ్యారు. పాత విద్యార్థులు మాత్రమే తరగతులకు వచ్చారు. పలువురు ప్లస్‌ టూ విద్యార్థులు యూనివర్సిటీ ఎంట్రెన్స్‌లకు ప్రిపేర్‌ అవుతుండటం కనిపించింది. కరోనా కారణంగా హుబే ప్రావిన్స్‌లో పాఠశాలలు జనవరి నెల నుంచి నిరవధికంగా మూతపడ్డాయి. చాలా రోజుల తర్వాత కరోనా వైరస్‌ కట్టడిలోకి వచ్చినప్పటికీ ప్రజల్లో ఇంకా భయాందోళనలు కనిపిస్తున్నాయి.


logo