మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 14:46:24

కరోనా ఆటలు.. తొలుత సోకిన వారికి బహుమతి

కరోనా ఆటలు.. తొలుత సోకిన వారికి బహుమతి

వాషింగ్టన్‌ : కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నది. కరోనా పేరు చెప్పగానే పరుగుపెడుతున్న ఈ తరుణంలో ఈ అంటువ్యాధిని ఎలా నియంత్రించాలో తెలియక అమెరికా తల పట్టుకొన్నది. ఇలాఉండగా, అమెరికా కుర్రకారు కొత్త రకం కరోనా ఆటలకు తెరలేపారు. కరోనా పార్టీలో ఎవరికి మొదటగా సోకుతుందో వారికి బహుమతిగా పిజ్జా లభిస్తుంది. 

అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అలబామా రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు ఇలాంటి పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి కొవిడ్ -19 పార్టీ అని పేరు పెట్టారట. కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకొని.. నిజంగానే పాజిటివ్‌ ద్వారా కరోనా వ్యాపిస్తుందా? అనే తెలుసుకోవడమే ఈ పార్టీ లక్ష్యమట. పార్టీని గ్రాండ్‌గా నిర్వహించేందుకు బహుమతులను కూడా ప్రకటించారు. ఈ పార్టీ ద్వారా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి పిజ్జాగా తొలి బహుమతి అందజేస్తారంట.

విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా కరోనా బారిన పడటానికి ఇలాంటి పార్టీలే కారణమని అలబామా నగర సలహాదారు సోనయా మెకిన్స్ట్రీ చెప్పారు. పార్టీలో పాల్గొన్నవారు ఇన్ఫెక్షన్ రావడానికి చేయగలిగినదంతా చేశారని, పార్టీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన వారి నుంచి కొంత డబ్బు వసూలు చేసి.. ఆమొత్తాన్ని వ్యాధి సోకిన మొదటి వ్యక్తికి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 

ఈ సంఘటన గురించి తమ వద్ద సమాచారం ఉన్నదని, అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని భావించామని అధికారులు చెప్తున్నారు. తరువాత దర్యాప్తు చేసినప్పుడు అలాంటి పార్టీ నిజంగానే జరిగిందని తెలిసిందని వారన్నారు. అంతకుముందు, విద్యార్థులు వల్లా-వల్లా అనే ప్రదేశంలో అలాంటి పార్టీ చేసి కరోనా బారిన పడటానికి ప్రయత్నించినట్లు సమాచారం. 

కరోనా వైరస్‌ బారిన పడటం తమకు ఆరోగ్యపరంగా మంచిదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్టుగా ఒక నివేదిక తేల్చింది. ఈ వైరస్‌కు గురవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని వారు భావిస్తున్నట్లు ఆ నివేదికలో వెల్లడించారు.


logo