బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 13:08:28

పెంపుడు చేపకు అంత్యక్రియలు.. వైరల్‌ వీడియో..!

పెంపుడు చేపకు అంత్యక్రియలు.. వైరల్‌ వీడియో..!

సాధారణంగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను పెంచుకునే ఎవరైనా సరే.. అవి చనిపోతే విచారం వ్యక్తం చేస్తారు. బాధ పడతారు. అయితే ఆ విద్యార్థులు మాత్రం తమ పెంపుడు చేప చనిపోయిందని బాధ పడ్డారు. అంతేకాదు.. దానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... 

ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆవరణలో ఉన్న అక్వేరియంలో విద్యార్థులు గత కొంత కాలంగా సిల్వర్‌ కార్ప్‌ జాతికి చెందిన ఓ చేపను అపురూపంగా పెంచుతున్నారు. దానికి లూంపా అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ మధ్యే ఆ చేప చనిపోయింది. దీంతో ఆ చేపకు ఆ వర్సిటీ విద్యార్థులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..! logo