శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 13:13:09

ఆన్‌లైన్ క్లాసులో స్టూడెంట్ మిస్సింగ్‌‌.. ఇప్పుడు ఇదొక‌ ట్రెండ్!

ఆన్‌లైన్ క్లాసులో స్టూడెంట్ మిస్సింగ్‌‌.. ఇప్పుడు ఇదొక‌ ట్రెండ్!

పిల్ల‌ల ఆన్‌లైన్ క్లాసుల కోసం త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి స్మార్ట్‌ఫోన్‌, నెట‌వర్క్ అందిస్తుంటే పిల్ల‌లు మాత్రం వేషాలు వేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆన్‌లైన్ క్లాసు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఒక‌రింట్లో దోపిడీ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో ఎంత‌గా వైర‌ల్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు అలాంటి మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దీని గురించి చ‌దివే ముందు వీడియో చూడ‌డం బెట‌ర్‌. వీడియోలో స్టూడెంట్లు అంద‌రూ ఆన్‌లైన్ క్లాస్‌లో హాజ‌రైయ్యారు. ఇంత‌లోనే ఒక ఒక విద్యార్థిని గుర్తు తెలియ‌ని మ‌నుషులు మాస్క్ ధ‌రించి కిడ్నాప్ చేశారు.

దీంతో భ‌య‌ప‌డిన లెక్చ‌ర‌ర్ 'అత‌డిని ఎవ‌రైనా కిడ్నాప్ చేశారా?  పోలీసుల‌కు ఫోన్ చేయాలా' అని దీర్ఘం తీసేలోపే ఒక అమ్మాయి ప‌డి ప‌డి న‌వ్వింది. దీంతో లెక్చ‌ర‌ర్‌కి కోపం వ‌చ్చింది. ఇంత‌కీ అమ్మాయి న‌వ్విందో ఎందుకు తెలుసా? ఆ కిడ్నాపింగ్ విద్యార్థి ఆడుతున్న డ్రామా. ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతున్న‌ప్పుడు ఎవ‌రికైనా క్లాస్ విన‌డం ఇష్టం లేక‌పోతే ఇలాంటి కిడ్నాప్ డ్రామాలు చేస్తున్నారు. పైగా దీనికి 'ఆన్‌లైన్ క్లాస్ కిడ్నాప్' అనే పేరు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిని చూసిన కొంద‌రు ఈ ఐడియా ఏదో భ‌లే ఉందే అంటుంటే.. త‌ల్లిదండ్రులు ఏమో కోపానికి గుర‌వుతున్నారు. చ‌దువుకోమ‌ని చెబుతుంటే ఇలాంటి ప‌నులు చేస్తారా అని మండిప‌డుతున్నారు. 


logo