మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 12:14:32

డ్ర‌మ్ములో షికారు.. బైక్ కూడా ప‌నికిరాదు!

డ్ర‌మ్ములో షికారు.. బైక్ కూడా ప‌నికిరాదు!

షికారు అంటే ఎప్పుడూ బైక్‌, కారు, బ‌స్సుల్లోనే వెళ్లాలా.. అప్పుడ‌ప్పుడు ఇలా వెరైటీగా డ్ర‌మ్ములో కూడా వెళ్తే బాగుటుంది క‌దా! మ‌రి ఈ డ్ర‌మ్ము వాహనం ఎలా త‌యారు చేయాలి? అని మాత్రం అడ‌గ‌కండి. జ‌స్ట్ వీడియో చూసి ఒక ఐడియా తెచ్చుకోండి. ఓ వ్య‌క్తి సాధార‌మైన డ్ర‌మ్ బ్యారెల్‌ను బైక్‌లా మార్చేశాడు. అందులో కూర్చొని రోడ్డు మీద ర‌య్ ర‌య్‌మంటూ రౌండ్లు కొడుతున్నాడు. డ్ర‌మ్ముకి మ‌ధ్య‌లో కూర్చోవ‌డానికి స‌రిప‌డా సీటు త‌యారు చేశాడు. వెనుక‌వైపు ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఎర్ర‌టి జెండాను అమ‌ర్చాడు. అన్ని ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత ప్ర‌యాణం కొన‌సాగించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింగ హంగామా చేస్తుంది. ఈ వీడియో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మే కాదు.. డ్ర‌మ్ షికారు చేయాల‌నిపించ‌డం ఖాయం అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఈ వాహ‌నం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. 

 


logo