శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 09:10:13

ఇద్ద‌రు ఒకే ద‌గ్గ‌ర ఉండొద్దు.. బ్రిట‌న్‌లో తీవ్ర ఆంక్ష‌లు

ఇద్ద‌రు ఒకే ద‌గ్గ‌ర ఉండొద్దు.. బ్రిట‌న్‌లో తీవ్ర ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌: క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో బ్రిట‌న్ తీవ్ర ఆంక్ష‌లు విధించింది. కొత్త రూల్స్‌ను ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌క‌టించారు. రోజులో ఒకేసారి మాత్రం ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్నారు. ప‌నిచేసే ప్ర‌దేశానికి వెళ్లేందుకు ఈ వెస‌లుబాటు క‌ల్పించారు. ఎక్స‌ర్‌సైజ్‌లు చేసే వారికి కూడా అనుమ‌తి ఇచ్చారు.  కేవ‌లం అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను మాత్ర‌మే ఖ‌రీదు చేసేందుకు షాపుల‌కు వెళ్లాలి. వైద్య అవ‌స‌రాల కోసం వెళ్ల‌వ‌చ్చు అన్నారు. నిత్యావ‌స‌రాలు కాన‌టువంటి వ‌స్తువుల‌ను అమ్మే షాపుల‌ను మూసివేశారు. ఎక్క‌డ కూడా ఇద్ద‌ర్ని మించి జ‌నం గుమ్మికూడ‌వ‌ద్దు అని ప్ర‌ధాని హెచ్చ‌రించారు. బ్రిట‌న్‌లో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 335కు చేరుకున్న‌ది. ఒక‌వేళ ప్ర‌జ‌లు ఈ నియ‌మావ‌ళిని పాటించ‌ని ప‌క్షంలో పోలీసులు త‌మ అధికారాల‌ను వినియోగిస్తార‌న్నారు. టీవీల్లో జాతిని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. క‌నీసం మూడు వారాల పాటు ఈ నిషేధ ఆజ్ఞ‌లు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత స‌మీక్ష ప్ర‌కారం కొన‌సాగింపు ఉంటుంద‌న్నారు. 


logo