శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 17:26:51

పిల్లాడిని క్యాచ్ ప‌ట్ట‌డంతో ఫేమ‌స్ అయ్యాడు!

పిల్లాడిని క్యాచ్ ప‌ట్ట‌డంతో ఫేమ‌స్ అయ్యాడు!

వ‌స్తువుల‌ను ఎవ‌రైనా క్యాచ్ ప‌డుతారు. కానీ స‌రైన స‌మ‌యానికి ప‌ట్టినోడే అంద‌రికీ గుర్తిండిపోతాడు. అయితే ఇత‌ను క్యాచ్ ప‌ట్టింది బాల్‌ని కాదు, మ‌నిషిని. అందుకే ఫేమ‌స్ అయ్యాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. త‌మిళ‌నాడులోని మనప్పరాయ్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల ఎడ్రిక్ ఎజిల్ అనే బాలుడు టెర్ర‌స్ మీద ఆడుకోవ‌డానికి వెళ్లాడు. తోడుగా త‌న సోద‌రి కూడా ఉంది. ఇద్ద‌రు ఆడుకుంటుండ‌గా కాలు జారి కింద‌ప‌డ‌బోయాడు. ఇంటికి పిట్ట‌గోడ ఉండ‌టంతో దానిని ప‌ట్టుకొని వేలాడుతూ హెల్ప్ అని అరిచాడు. దీంతో ఎజిల్ సోద‌రి త‌న‌ని లాగేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. ఎజిల్ అరుపులు విని అటుగా వెళ్తున్న ఓ వ్య‌క్తి ఆ పిల్లాడిని క‌రెక్ట్ స‌మ‌యానికి క్యాచ్ ప‌ట్టాడు. బాబుని సుర‌క్షితంగా కాపాడిన అత‌ను ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు. మ‌రింకెందుకు ఆల‌స్యం అత‌ని సాహ‌సాన్ని మీరు కూడా చూసేయండి.