గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 16:09:16

ఈ కుక్కకు తన రోజచ్చింది..హ్యుందాయ్‌ షోరూం సేల్స్‌మెన్‌ అయింది.!

ఈ కుక్కకు తన రోజచ్చింది..హ్యుందాయ్‌ షోరూం సేల్స్‌మెన్‌ అయింది.!

రియోడిజనీరో: ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది. ఈ సామెత ఓ వీధికుక్క విషయంలో నిజమైంది. ప్రతిరోజూ ఓ కారు షోరూం ముందు తిరిగే కుక్క అందులోని ఉద్యోగుల మనసు దోచుకుంది. శునకం అందరితో స్నేహంగా ఉండడాన్ని గమనించిన షోరూం యజమాని దాన్ని దత్తత తీసుకొని ఏకంగా సేల్స్‌మెన్‌ ఉద్యోగం ఇచ్చేశాడు.

ఆ వీధికుక్కకు టక్సన్‌ప్రైమ్‌ అని నామకరణం చేసి ఐడీ కార్డు తయారుచేయించారు. ఇప్పుడది కారు షోరూం ముందు సేల్స్‌మెన్‌ హోదాలో మెడలో ఐడీ వేసుకొని ఉద్యోగం చేస్తోంది. షోరూం వచ్చేవారంతా దీన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కుక్క ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టారు. దీంతో ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.   

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo