శనివారం 16 జనవరి 2021
International - Dec 23, 2020 , 14:47:21

వేలాదిగా స్తంభించిన ట్ర‌క్కులు.. పోలీసుల‌తో డ్రైవ‌ర్ల ఘ‌ర్ష‌ణ‌

వేలాదిగా స్తంభించిన ట్ర‌క్కులు.. పోలీసుల‌తో డ్రైవ‌ర్ల ఘ‌ర్ష‌ణ‌

హైద‌రాబాద్‌:  బ్రిట‌న్‌, ఫ్రాన్స్ స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉన్న‌ది.  కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో బ్రిట‌న్ త‌న స‌రిహ‌ద్దుల‌ను  మూసివేసింది.  దీంతో ఆ ప్రాంతంలో వేలాది సంఖ్య‌లో వాహ‌నాలు నిలిచిపోయాయి.  అయితే యూకేతో ఉన్న బోర్డ‌ర్ల‌ను ఫ్రాన్స్ రీఓపెన్ చేసింది.  ఫ్రాన్స్‌లో జీవిస్తున్న బ్రిటీష‌ర్లు ట్రావెల్ చేసేందుకు అనుమ‌తిస్తున్నారు. అయితే ఇంకా ట్ర‌క్కు డ్రైవ‌ర్లకు అనుమ‌తి ద‌క్క‌డం లేదు.  డోవ‌ర్ ప్రాంతంలో వేల సంఖ్య‌లో ట్ర‌క్కులు నిలిచిపోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. పోలీసుల‌తో డ్రైవ‌ర్లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.  వేచి ఉన్న ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌కు తాజాగా క‌రోనా పరీక్ష‌లు చేప‌డుతున్నారు. వారంద‌రికీ ర్యాపిడ్ టెస్టులు నిర్వ‌హిస్తున్నారు.  ఎన్‌హెచ్ఎస్‌, ట్రేస్ స్టాఫ్ నిర్వ‌హిస్తున్న ర్యాపిడ్ టెస్టుల‌కు సైనికులు స‌హ‌క‌రిస్తున్నారు.  కొత్త ర‌కం క‌రోనా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దుల్ని ఆదివారం నుంచి మూసివేశారు.  బ్రిట‌న్‌లో వేరు వేరు ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటున్న డ్రైవ‌ర్ల‌ను అధికారులు అడ్డుకుంటున్నారు.  క్లియ‌రెన్స్ ద‌క్కిన త‌ర్వాత‌నే డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నెగ‌టివ్ ప‌త్రం ఉన్న‌వారికి మాత్ర‌మే దేశంలోకి అనుమ‌తి ఇస్తున్నారు. మ‌రో వైపు స్కూళ్ల‌ను జ‌న‌వ‌రిలో రీఓపెన్ చేయ‌నున్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.