శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 22, 2020 , 13:41:50

స్టీఫెన్ హాకింగ్ వెంటిలేట‌ర్ ఆరోగ్య‌శాఖ‌కు దానం..

స్టీఫెన్ హాకింగ్ వెంటిలేట‌ర్ ఆరోగ్య‌శాఖ‌కు దానం..

హైద‌రాబాద్‌: ఖ‌గోళ శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ వాడిన వెంటిలేట‌ర్‌ను బ్రిట‌న్‌ ఆరోగ్య‌శాఖ‌కు డొనేట్ చేశారు.  క్యాంబ్రిడ్జ్ సిటీలో ఉన్న రాయ‌ల్ పాప్‌వ‌ర్త్ హాస్పిట‌ల్‌కు ఆ వెంటిలేట‌ర్‌ను అంద‌జేశారు. కోవిడ్‌19 పేషెంట్ల‌కు ఆ వెంటిలేట‌ర్ స‌హ‌క‌రిస్తుంద‌న్న ఉద్దేశంతో దాన్ని దానం చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధప‌డిన ఖ‌గోళ శాస్త్ర‌వేత్త హాకింగ్ 2018లో మ‌ర‌ణించారు. హాకింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న‌కు సంబంధించిన అన్ని మెడిక‌ల్ ప‌రిక‌రాల‌ను ఎన్‌హెచ్ఎస్‌కు డొనేట్ చేశామ‌ని, ఇంకా కొన్ని ఐట‌మ్స్ మిగిలి ఉన్న‌ట్లు కూతురు లూసీ హాకింగ్ మీడియాతో తెలిపారు. కరోనా క‌ష్ట‌కాల స‌మ‌యంలో ఆ వైద్య ప‌రికాలు ఏమైనా ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్న ఉద్దేశంతో వాటిని నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్‌(ఎన్‌హెచ్ఎస్)‌కు ఇస్తున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బ్రిట‌న్ వ‌ద్ద సుమారు 10 వేల వెంటిలేట‌ర్లు ఉన్నాయి. అయితే మ‌రో 18 వేల వెంటిలేట‌ర్లు అవ‌స‌రం ఉంటుంద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి మాట్ హాన్‌కాక్ తెలిపారు. logo