మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 01:03:49

అమెరికా డీసీ సర్క్యూట్‌ కోర్టు సీజేగా శ్రీనివాసన్‌

అమెరికా డీసీ సర్క్యూట్‌ కోర్టు సీజేగా శ్రీనివాసన్‌
  • ఈ పదవి చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ న్యాయమూర్తి శ్రీనివాసన్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారత్‌లో హైకోర్టుల స్థాయిలో అమెరికాలో సర్క్యూట్‌ కోర్టులు ఉంటాయి. సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన కోర్టులుగా వీటిని పరిగణిస్తారు. ఈ కోర్టుల పరిధిలో కొన్ని నగరాలు లేదా కొన్ని రాష్ర్టాలు ఉంటాయి. శ్రీనివాసన్‌ (52) ‘యూస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఫర్‌ ద డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌' (డీసీ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు) ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 12న ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాసన్‌కు అమెరికా న్యాయ వ్యవస్థలో మంచి పేరున్నది. 


logo