గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 30, 2020 , 17:39:50

వచ్చే నెల భారత్‌కు రానున్న శ్రీలంక ప్రధాని

వచ్చే నెల భారత్‌కు రానున్న శ్రీలంక ప్రధాని

న్యూఢిల్లీ:   వచ్చే నెల ప్రారంభంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే  భారత్‌లో పర్యటించనున్నారని భారత విదేశాంగశాఖ గురువారం తెలిపింది. గతేడాది నవంబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహింద భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహింద రాజపక్సే ఫిబ్రవరి 8 నుంచి 11 భారత్‌లో పర్యటిస్తారు. ఫిబ్రవరి 7నే ఆయన భారత్‌ చేరుకుంటారు. 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు.  అధికారిక సమావేశాల అనంతరం దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వారణాసి, సారనాథ్‌, బుద్ధగయతో పాటు పుణ్యక్షేత్రం తిరుపతిని సందర్శిస్తారని రవీశ్‌ కుమార్‌ తెలిపారు. మోదీ, మహింద భేటీలో ప్రధానంగా ప్రాంతీయ భద్రతపై చర్చించనున్నట్లు సమాచారం.


logo
>>>>>>