శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 02, 2020 , 00:50:56

శ్రీలంక పార్లమెంట్‌ రద్దు!

శ్రీలంక పార్లమెంట్‌ రద్దు!


కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ రద్దుకానున్నది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి దినేశ్‌ గుణవర్ధన తెలిపారు. శ్రీలంకలో ఈ ఏడాది ఆగస్టులో సాధారణ ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. గత ప్రభుత్వం ఆర్టికల్‌ 19ఏను సవరించి పెద్ద తప్పు చేసిందని రాజపక్స భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ముందస్తుగా ప్రజాతీర్పును కోరాలని నిర్ణయించినట్లు దినేశ్‌ చెప్పారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత నిర్ణయం వెలువడే అవకాశమున్నదని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఆ దేశ ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నది. 




logo