గురువారం 28 మే 2020
International - May 08, 2020 , 14:59:33

ప‌ర్యాట‌క రంగం పున‌రుద్ధ‌ర‌ణ‌కు అధిక వ్య‌యం: రాజ‌ప‌క్సే

ప‌ర్యాట‌క రంగం పున‌రుద్ధ‌ర‌ణ‌కు అధిక వ్య‌యం: రాజ‌ప‌క్సే

కొలంబో: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి పోయిన త‌రువాత ప‌ర్యాట‌న రంగం పున‌రుద్ధ‌రించ‌డానికి శ్రీలంక ప్ర‌భుత్వం అధిక వ్య‌యం కేటాయిస్తుంద‌ని అధ్య‌క్షుడు రాజ‌ప‌క్రే అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్ర‌యాణ ఆంక్ష‌లు, విమానాశ్ర‌యాలు, దేశ స‌రిహ‌ద్దులు మూసివేయ‌డం, అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌కుల‌కు అడ్డ‌క‌ట్ట వేయ‌డంతో శ్రీంలంక దేశ టూరిజం ఘోర‌మైన సంక్షోభంలో కూరుకుపోయింది. 
ఆర్థిక పున‌ర్జీవ‌నం, పేద‌రిక నిర్మూల‌న‌పై నియ‌మించిన ప్రెసిడెన్షియ‌ల్ టాస్క్ ఫోర్స్ స‌భ్యుల‌తో జ‌రిగిన స‌మావేశంలో రాజ‌ప‌క్సే మాట్లాడుతూ... జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు తోడ్పాటును అందించే ప‌ర్యాట‌క రంగాన్ని మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగూణంగా పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దేశానికి ప‌ర్యాట‌కులు తిరిగిరావ‌డం ప్రారంభం కాగానే మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ ఆధారంగా వీసాలు జారీ చేసేలా వ్య‌వ‌స్థ రూపొందించాల‌ని సూచించారు. క‌రోనా  వైర‌స్ బారిన ప‌డిన దేశాల ప‌ర్యాట‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌న్నారు.
 వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి శ్రీలంక తీసుకున్న విజ‌య‌వంత‌మైన ప్ర‌య‌త్నాలు వారికి చూపించ‌డం ద్వారా వైద్య ప‌ర్య‌ట‌కులను ప్రోత్స‌హించ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. శీతాకాలంలో రెగ్యుల‌ర్‌గా ఇత‌ర దేశాల‌కు వెళ్లే ప‌ర్య‌ట‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌చారం చేయాల‌న్నారు. దేశీయ ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా హోట‌ల్ ప‌రిశ్ర‌మ మెరుగ‌వుతుంద‌ని గుర్తు చేశారు. శ్రీలంక‌లో శుక్ర‌వారం వ‌ర‌కు క‌రోనా వైర‌స్ రోగుల సంఖ్య 824కు చేరుకుంద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక‌లో వైర‌స్ బారిన‌ప‌డి 9 మంది మృత్యువాత‌ప‌డ్డారు. 


logo