గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 12:41:47

శ్రీలంకలో కరోనా కర్ఫ్యూ ఎత్తివేత

శ్రీలంకలో కరోనా కర్ఫ్యూ ఎత్తివేత

కొలంబో: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూని ఏప్రిల్‌ 27న ఎత్తివేస్తామని శ్రీలంక పోలీసులు ప్రకటించారు. మార్చి 20 నుంచి దేశంలో 24 గంటల కర్ఫ్యూ కొనసాగుతున్నది. దీన్ని ఏప్రిల్‌ 27న (సోమవారం) ఉదయం 5 గంటల నుంచి ఎత్తివేస్తామని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 414 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల ఏడుగురు మరణించారు. శుక్రవారం (ఏప్రిల్‌ 24న) 49 కేసులు నమోదయ్యాయి. దేశంలో అదే ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు.   


logo