ఆదివారం 05 జూలై 2020
International - Jun 11, 2020 , 15:46:34

ఆగస్టు 5న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు

ఆగస్టు 5న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు

కొలంబో: శ్రీలంక దేశ పార్లమెంట్‌ ఎన్నికలను ఆగస్టు 5న నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదాపడ్డ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వైద్యుల సలహాలు తీసుకొని ఆ దేశ ఎన్నికల సంఘం తేదీని నిర్ణయించింది. ఈ వారాంతంలో నమూనా ఎన్నికలు (మాక్‌ ఎలక్షన్స్‌) నిర్వహించనున్నారు. కొవి‌డ్‌ -19 నేపథ్యంలో  పోలింగ్‌ బూత్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అమలు చేయాల్సిన ఆరోగ్య ప్రమాణాలపై దృష్టిసారిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ చైర్మన్‌ మహింద దేశప్రియ పేర్కొన్నారు. 

  ఈ ఏడాది మార్చి 2న గడువు పూర్తికావడంతో ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఏప్రిల్‌ 25 న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగా, కొవిడ్‌ విజృంభణతో అది వాయిదాపడింది. ప్రస్తుతం పాత ఎన్నికల గెజిట్‌కు సవరణ చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ కొత్త గెజిట్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా, తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని నిలుపుకుంటుందని రాజపక్స ధీమా వ్యక్తంచేస్తున్నారు.


logo