సోమవారం 01 జూన్ 2020
International - Apr 21, 2020 , 10:55:21

కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా

కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా

శ్రీలంక: శ్రీలంకలో పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రెండు నెలల అనంతరం కరోనా పరిస్థితిని బట్టి తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. శ్రీలంకలో ఇప్పటి వరకు 295 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 7గురు మృత్యువాత పడ్డారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేన మార్చ్‌ 2వ తేదీన పార్లమెంట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

 ఈ నెల 25వ తేదీన ఎన్నికలు ఉండాల్సింది. 20 జూన్‌ వరకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌ గజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎనికల వాయిదా వేయడం వల్ల తలెత్తే రాజ్యంగపరమైన ప్రతిష్టంభనపై అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం తీసుకోవాలని అధ్యక్షుడు రాజపక్సేనాకు ఈసీ లేఖ రాసింది. 


logo