బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 22:53:58

శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా!

శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా!

కొలంబో: కరోనా వైరస్‌ నేపథ్యంలో శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 25న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు జరుగాల్సి ఉంది. వైరస్‌ నియంత్రణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నెల 25వ తేదీ తర్వాత ఎన్నికల తేదీని ప్రకటిస్తామని శ్రీలంక ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు మహిందా దేశప్రియ గురువారం మీడియాకు చెప్పారు. రెండు వారాల క్రితం శ్రీలంకలో తొలి కరోనా కేసు నమోదైంది. 50 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించగా, 200 మందికి పైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 


logo