మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 08:38:41

ప్లాస్టిక్‌ దిగుమతులపై శ్రీలంక నిషేధం!

ప్లాస్టిక్‌ దిగుమతులపై శ్రీలంక నిషేధం!

కొలంబో: ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించాలని శ్రీలంక నిర్ణయించింది. పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా బొమ్మ‌లు, గృహావ‌స‌రాల‌కు వినియోగించే ప్లాస్టిక్ వ‌స్తువుల దిగుమతిపై నిషేధం విధించామ‌ని ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి మ‌హింద అమ‌ర‌వీర వెల్ల‌డించారు. ‌దీని ప్రభావం భారత్‌పై అధికంగా పడనుంది. మన దేశం నుంచి ప్లాస్టిక్‌ ఉత్పత్తులు శ్రీలంకకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. భార‌త్ త‌ర్వాత చైనా, థాయ్‌లాండ్ నుంచి అధికంగా శ్రీలంక ప్లాస్టిక్‌ వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ది. 

ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఏనుగులు, జింక‌లు ఇత‌ర అట‌వీ జంతువుల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతున్నాయ‌ని మ‌హింద అమ‌ర‌వీర అన్నారు. ప్లాస్టిక్ వ్య‌ర్థాల వ‌ల్ల దేశంలో భారీసంఖ్య‌లో ఏనుగులు, జింక‌లు చ‌నిపోయాయ‌ని, ఈ ప‌రిస్థితిని వీలైనంత తొంద‌ర‌గా క‌ట్ట‌డిచేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, అందుకే ప్లాస్టిక్ దిగుమ‌తుల‌పై నిషేధం విధించిన‌ట్లు చెప్పారు. నిత్యావ‌స‌రం కాని వ‌స్తువుల‌పై శ్రీలంక ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిషేధం విధించింది. 


logo