శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 11:33:18

చైనీస్ వైర‌స్‌.. వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌

చైనీస్ వైర‌స్‌.. వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అంటూ విమ‌ర్శ‌లు చేసిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెన‌క్కి త‌గ్గారు.  చైనీస్ వైర‌స్ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో ట్రంప్ త‌న మాట మార్చారు.  ఆసియా అమెరిక‌న్ల‌ను ర‌క్షించుకోవాల‌న్నారు.  అమెరికాలో ఉన్న ఆసియా దేశ ప్ర‌జ‌ల‌ను మ‌న‌మే కాపాడుకోవాల‌ని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌వారిని కూడా ఆదుకోవాల‌న్నారు. ఆసియా ప్ర‌జ‌లు అద్భుత‌మైన వార‌ని, వైర‌స్ వ్యాప్తికి వారిని నిందించ‌డం స‌రికాదు అని, వైర‌స్ నిర్మూల‌న‌కు వారంతా మ‌న‌తో క‌లిసి ప‌నిచేస్తున్నార‌ని,  అంద‌ర‌మూ ఆ మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అన‌డంతో అది జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లుగా ముద్ర‌ప‌డ్డాయి. ఆ వ్యాఖ్య‌ల‌తో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆసియ‌న్ల‌పై దాడులు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ట్రంప్ కాస్త త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. వైర‌స్ విష‌యంలో కేవ‌లం సైంటిఫిక్ డేటాను మాత్ర‌మే ప్ర‌స్తావించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న‌ది. 

 logo