బుధవారం 27 మే 2020
International - May 17, 2020 , 13:47:15

క్రిమిసంహారకాలు చల్లినా.. కరోనా చావదు

క్రిమిసంహారకాలు చల్లినా.. కరోనా చావదు

జెనీవా: కరోనా వైరస్‌ నిర్మూలన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను చల్లడం వల్ల మంచికంటే ప్రమాదమే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చే కరోనా వైరస్‌ను అడ్డుకోలేకపోవడమే కాకుండా, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీధులు, మార్కెట్‌ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను పిచికారి చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను మనుషులపైనా చల్లుతున్నారని, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని సూచించింది. దీనివల్ల కళ్లకు ప్రమాదం ఉండటంతోపాటు, శ్వాసకోస, చర్మ సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కొన్ని ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్‌, క్లోరిన్‌తోపాటు ఇతర రసాయనాలను చల్లుతున్నారు.

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు లక్షలకుపైగా బాధితులు మరణించారు. ప్రపంచంలో 47,33,858 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo