గురువారం 04 జూన్ 2020
International - Apr 20, 2020 , 16:11:49

ఇంటికొచ్చి స‌రుకులందిస్తోన్న‌ స్పైడ‌ర్ మ్యాన్..ఫొటోలు

ఇంటికొచ్చి స‌రుకులందిస్తోన్న‌ స్పైడ‌ర్ మ్యాన్..ఫొటోలు

క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు ఇపుడు ప్ర‌పంచ‌దేశాల‌న్నీ లాక్ డౌన్ ను అనురిస్తున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా ఎక్క‌డిడిక్క‌డ ఇండ్ల‌కే ప‌రిమితమై పోయారు. క‌ష్ట‌కాలంలో స్పైడ‌ర్ మ్యాన్ ప్ర‌త్య‌క్షమై స‌మ‌స్య‌లు తీర్చుతాడ‌ని సినిమాల్లో చూశాం. కానీ ఇపుడు నిజంగా స్పైడ‌ర్ మ్యాన్ అంద‌రికీ అవ‌స‌ర‌మైన స‌రుకులు ఇచ్చి వెళ్తున్నాడు.

ట‌ర్కీలో బుర‌క్ సొయ్ లు అనే వ్య‌క్తి స్పైడ‌ర్ మ్యాన్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకుని, ఇంటికి కావాల్సిన నిత్య‌వ‌స‌ర స‌రుకులు అందిస్తున్నాడు. వృద్దుల‌కు కావాల్సిన పాలు, ఇత‌ర స‌రుకులు ఇంటి వద్ద‌కే వెళ్లి అందిస్తున్నాడు. ట్విట్ట‌ర్ లో బుర‌క్ సొయ్ లు స్పైడ‌ర్ మ్యాన్ గెట‌ప్ లో కారు, ట్రాక్ట‌ర్ పై వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ సేవ‌లందిస్తున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. నాకున్న శ‌క్తిని పొరుగువారికి సాయమందిచేందుకు ఉప‌యోగిస్తున్నానన్నాడు స్పైడ‌ర్ మ్యాన్. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo