బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 02:23:56

కరోనాకు యువరాణి బలి

కరోనాకు యువరాణి బలి

మాడ్రిడ్‌: కరోనా విశ్వమారికి స్పెయిన్‌ యువ రాణి మరియా థెరీసా బలయ్యారు. ఆమె వయసు 86 ఏండ్లు. ఆమెకు ఇటీవలే కరోనా వైరస్‌ సోకింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు, ప్రిన్స్‌ ఎన్రిక్‌  ఆదివారం ప్రకటించారు. మరియా శుక్రవారమే మరణించినట్టు సమాచారం. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కరోనా వల్ల మరణించడం ఇదే తొలిసారి. 

జర్మనీలో మంత్రి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుండటం తట్టుకోలేక జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ష్కాఫర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని శనివారం రైల్వే ట్రాక్‌కు సమీపంలో కనుగొన్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం ఎలా? అన్న ఆవేదనతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు. థామస్‌ ష్కాఫర్‌  పదేండ్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. logo