ఆదివారం 31 మే 2020
International - May 02, 2020 , 16:48:32

స్పెయిన్‌లో 25 వేలకు చేరిన కరోనా మృతులు

స్పెయిన్‌లో 25 వేలకు చేరిన కరోనా మృతులు

బార్సిలోనా: స్పెయిన్‌లో ఒకే రోజు 276 మంది కరోనా వైరస్‌తో మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 25,100కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 2,16,582 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 2,15,216గా ఉంది. ప్రపంచంలో కరోనా వైరస్‌తో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్‌ ఒకటి. అయితే దేశంలో మెళ్లమెళ్లగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 34,17,882 కరోనా కేసులు నమోదవగా, 2,39,913 మంది మరణించారు. 


logo