శనివారం 06 జూన్ 2020
International - Apr 14, 2020 , 15:56:05

స్పెయిన్‌లో 18వేలు దాటిన కరోనా మరణాలు

స్పెయిన్‌లో 18వేలు దాటిన కరోనా మరణాలు

లండన్‌:  స్పెయిన్‌లో  కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ  18,056 మంది మరణించారు. మంగళవారం ఒక్కరోజే 567 మంది  చనిపోయారు.  ప్రస్తుతం వైరస్‌ సోకిన వారి సంఖ్య 172,541కు చేరింది. అమెరికా, ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదైన మూడో దేశం స్పెయినే.   కరోనా కట్టడికి ఆదేశంలో మార్చి 14న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.  స్పెయిన్‌లో సోమవారం 280 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మార్చి 20వ తేదీ తర్వాత అతి తక్కువ సంఖ్యలో కొత్తగా 2,665 కేసులే నమోదయ్యాయి. ఐతే మంగళవారం ఒక్కసారిగా కొత్తకేసులు  1.8శాతం పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,045 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు స్పెయిన్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. 


logo