శుక్రవారం 29 మే 2020
International - Mar 31, 2020 , 17:01:24

కరోనాతో ఒకేరోజు 849 మంది మృతి

కరోనాతో ఒకేరోజు 849 మంది మృతి

హైదరాబాద్‌: కరోనా మృతుల సంఖ్యలో ఇటలీని వెనక్కినెట్టేలా కన్పిస్తోంది స్పెయిన్‌. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై త్వరగా స్పందించకపోవడంతో భారీ మూల్యం చెల్లిస్తోంది. స్పెయిన్‌లో కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 849 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8189కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కొత్తగా 9222 మందికి కరోనా పాజిటివ్‌ లక్షలణాలు బయటపడ్డాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 94,417కు చేరింది.


logo