బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 19:38:55

స్పెయిన్‌లో 4,576 కొత్త కేసులు

స్పెయిన్‌లో 4,576 కొత్త కేసులు

లండన్‌: స్పెయిన్‌లో కొత్తగా 4,576  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 605 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. దీంతో స్పెయిన్‌లో మొత్తం మరణాల సంఖ్య 15,843కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 157,022 మందికి వైరస్‌ సోకింది.   17 రోజుల  తర్వాత శుక్రవారం అత్యల్ప మరణాల సంఖ్య  నమోదైందని స్పెయిన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,783 చనిపోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 16,600కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అంతర్జాతీయంగా వైరస్‌ నుంచి 364,000 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. logo