శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 24, 2020 , 19:36:39

స్పెయిన్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు

స్పెయిన్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. నాలుగు వారాల తర్వాత రోజువారీ కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా  నమోదైనట్లు స్పెయిన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 367 మంది మృతి చెందినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 22,157కు చేరింది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 213,024కు పెరిగింది. అమెరికా, ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదైన మూడో దేశం స్పెయినే. ప్రస్తుతం వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 


logo