ఆదివారం 31 మే 2020
International - May 03, 2020 , 09:40:59

స్పెయిన్ ప్ర‌యాణికుల‌కు‌ మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి..

స్పెయిన్ ప్ర‌యాణికుల‌కు‌ మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి..


హైద‌రాబాద్‌: ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను వినియోగించుకునే వారు క‌చ్చితంగా మాస్క్‌లు ధ‌రించాల‌ని స్పెయిన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడు ఆ దేశంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు 60 ల‌క్ష‌ల మాస్క్‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని పెడ్రో సాంచేజ్ తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ లొకేష‌న్ల వ‌ద్ద మాస్క్‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఇక స్థానిక అధికారుల‌కు కూడా మ‌రో 70 ల‌క్ష‌ల మాస్క్‌ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని పెడ్రో తెలిపారు. దాదాపు ఏడు వారాల త‌ర్వాత‌.. స్పెయిన్‌లో జ‌నం భారీ సంఖ్య‌లో బ‌య‌ట‌కు వ‌చ్చారు.  ఔట్‌డోర్ల‌లో ఎక్స‌ర్‌సైజ్‌లు చేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.logo