గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:27

స్పెయిన్‌లో మళ్లీ ఆంక్షలు

స్పెయిన్‌లో మళ్లీ ఆంక్షలు

మాడ్రిడ్‌: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో స్పెయిన్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. ఇటీవల కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెల 21న ఇక్కడ లాక్‌డౌన్‌ ఎత్తేశారు. దాంతో వైరస్‌ మళ్లీ విజృంభించింది. రోజూ కనీసం 500 నుంచి వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన నియమాలను ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ప్రభుత్వపరంగా పలు కఠిన ఆంక్షలు విధించింది. పబ్బులు, పార్టీలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 


logo