ఆదివారం 31 మే 2020
International - Apr 20, 2020 , 17:53:12

స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

స్సెయిన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య రెండు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 4,266 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం స్పెయిన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200,210కి పెరిగింది. ఇవాళ మరో 399 మంది మృతిచెందడంతో  మొత్తం మరణాల సంఖ్య 20,852కు చేరుకున్నది. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రెండో దేశం స్పెయినే కావడం గమనార్హం. అమెరికాలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 750,000 లక్షలు దాటింది. logo