శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 18:59:41

ఒక్క స్పెయిన్‌లోనే 14555 మంది మృతి

ఒక్క  స్పెయిన్‌లోనే 14555 మంది మృతి

లండన్‌: స్పెయిన్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. వరుసగా రెండో రోజు కోవిడ్‌-19 మరణాల సంఖ్య పెరిగింది.  స్పెయిన్‌లో 24 గంటల్లో 757 మంది చనిపోయారు. అంతకుముందు రోజు 743 మంది మరణించారు. దేశ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14555కు చేరిందని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత యూరప్‌ దేశాల్లోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తోంది. 

పలు దేశాల కరోనా వివరాలు

ఇరాన్‌: 64,586 (3,993 మృతి)

బెల్జియం: 23,403 (2,240 మృతి)

స్విట్జర్లాండ్‌: 22,789 (705 మృతి)

రష్యా: 8,672 (63 మృతి)


logo