నింగిలోకి దూసుకెళ్లి.. రికార్డు సృష్టించిన స్పేస్ఎక్స్ రాకెట్

శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్‌కు చెందిన సంస్థ స్పేస్ఎక్స్ కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రాకెట్లో 143 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత సాధించింది. గతంలో భారత్‌కు చెందిన ఇస్రో పేరిట ఉన్న రికార్డును స్పేస్ఎక్స్ బద్దలు కొట్టింది. ఖర్చు తగ్గించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ మిషన్.. క్యాబ్‌లో ప్రయాణించడం వంటిదిగా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మిషన్‌కు ట్రాన్స్పోర్టర్-1 అని పేరు పెట్టారు.
ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8.31 గంటలకు) రెండు దశల ఫాల్కన్-9 రాకెట్లను ఉపగ్రహ అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే 143 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రైవేటుపరంగా కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఫాల్కన్-9143 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లిందని స్పేస్ఎక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసింది. ఒకే మిషన్‌లో పంపిన అతి ఎక్కువ ఉపగ్రహాలు ఇవే కావడం విశేషం. దీంతో స్పేస్ఎక్స్ మొట్టమొదటి స్మాల్‌శాట్ రైడ్ షేర్ ప్రోగ్రాం మిషన్ విజయవంతంగా పూర్తయింది. 2017 ఫిబ్రవరి నెలలో ఇస్రో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ రికార్డును ఇప్పుడు స్పేస్ఎక్స్ అధిగమించింది.
అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఉపగ్రహాలలో క్యూబ్‌శాట్స్, మైక్రోసాట్స్తోపాటు 10 స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి. సుమారు 30 నిమిషాల లిఫ్ట్ ఆఫ్ తర్వాత మిషన్ ఉపగ్రహాలను అమర్చడం ప్రారంభించిందని స్పేస్ఎక్స్ సంస్థ వెల్లడించింది. స్పేస్ఎక్స్ తన స్మాల్‌శాట్ రైడ్ షేర్ ప్రోగ్రాం కింద ఈ మిషన్‌ను మొదటిసారిగా నిర్వహించింది, ఇది చిన్న ఉపగ్రహ వినియోగదారులకు స్పేస్ఎక్స్తో కక్ష్యలోకి ప్రయాణించేందుకు పేర్లను బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు స్పేస్ఎక్స్ కంపెనీ కిలోగ్రాముకు 15,000 డాలర్ల రుసుం వసూలు చేసినట్లు సమాచారం.
చిన్న కంపెనీలకు అవకాశాలు
రైడ్ షేర్ ప్రోగ్రాం కింద చిన్న ఉపగ్రహ సంస్థలకు తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు స్పేస్ఎక్స్ సంస్థ తెలిపింది. 200 కిలోల బరువున్న ఉపగ్రహానికి ప్రారంభ రుసుం 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.73 లక్షలు) నుంచి ఉన్నది. స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చిన్న కంపెనీలు తమ ఉపగ్రహాలను విజయవంతంగా పంపుకోవచ్చు. ఆదివారం ప్రయోగించిన 143 ఉపగ్రహాలలో అమెరికా, జర్మనీలకు చెందిన 48 ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, 17 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 30 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. ఫాల్కన్-9 రాకెట్ షూ బాక్స్ పరిమాణ క్యూబెట్లను, భారీ మైక్రో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది.
Liftoff! pic.twitter.com/js3zVM77rH
— SpaceX (@SpaceX) January 24, 2021
రికార్డు బద్దలుకు సంఖ్య సరిపోయింది: నాసా
ఒక మిషన్‌లో ప్రయోగించిన ఉపగ్రహం ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడానికి పేలోడ్ / ఉపగ్రహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. మునుపటి రికార్డు భారత్‌కు చెందిన ఇస్రో 104 ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును స్పేస్ఎక్స్ అధిగమించిందని నాసా పేర్కొన్నది. కాగా, స్పేస్ఎక్స్ మునుపటి రికార్డు 64 ఉపగ్రహాలు. ఎస్ఎస్ఓ-ఏ అని పిలిచిన ఈ మిషన్ డిసెంబర్ 2018 లో ప్రారంభించబడింది. ఫ్లోరిడాలోని పోలార్ కారిడార్ మార్గాన్ని ఉపయోగించి ట్రాన్స్పోర్టర్-1 ను ప్రయోగించారు.
104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి 2017 లో ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో ఎక్కువ భాగం యూఎస్ ఉపగ్రహాలు. ఆ సమయంలో ఇది ఒక రికార్డ్. ఇంతకు ముందు ఈ రికార్డు రష్యా పేరిట ఉండేది. ఇస్రో ఈ మిషన్‌ను పీఎస్ఎల్వీ రాకెట్‌తో పూర్తి చేసింది. ఈ మిషన్‌కు ఇస్రో చైర్మన్ కే శివన్ నేతృత్వం వహించారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి
- ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..
- గులాబీమయమైన దొంగలమర్రి..
- ప్రభాస్ రికార్డు..సినిమాకు 100 కోట్ల పారితోషికం..!
- ఈ లిఫ్టుల ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు : మంత్రి హరీశ్