గురువారం 09 జూలై 2020
International - May 28, 2020 , 10:37:56

ఆఖ‌రి క్ష‌ణాల్లో స్పేస్ఎక్స్ వ్యోమ‌నౌక‌ నిలిపివేత‌..

ఆఖ‌రి క్ష‌ణాల్లో స్పేస్ఎక్స్ వ్యోమ‌నౌక‌ నిలిపివేత‌..


హైద‌రాబాద్‌: వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డం వ‌ల్ల .. స్పేస్ఎక్స్ సంస్థ త‌న రాకెట్ ప్ర‌యోగాన్ని నిలిపివేసింది. ఇద్ద‌రు నాసా ఆస్ట్రోనాట్స్‌ను నింగిలోకి పంపాల‌నుకున్న‌.. ఎల‌న్ మ‌స్క్ ప్ర‌యోగానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. వాస్త‌వానికి డ్రాగ‌న్ స్పేస్‌క్రాఫ్ట్ .. ఫ్లోరిడాలోని కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్ నుంచి ప్ర‌యోగించాల్సి ఉన్న‌ది. కానీ ఆ వ్యోమ‌నౌక ఎగ‌ర‌డానికి 17 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ నిలిపివేశారు.  మే 30వ తేదీన మ‌ళ్లీ డ్రాగ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఎగ‌ర‌వేయ‌నున్నారు. డ‌గ్ హ‌ర్లే, బాబ్ బెహ‌కెన్ ఆస్ట్రోనాట్స్ ఇద్ద‌రూ ఆ రాకెట్‌లో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్ల‌వ‌ల‌సి ఉన్న‌ది. స‌మీప భూక‌క్ష్య‌లోకి ట్యాక్సీ స‌ర్వీసులు మొద‌లుపెట్టాల‌నుకున్న స్పేస్ఎక్స్ ప్రైవేటు సంస్థ‌.. తొలిసారి త‌మ రాకెట్ ద్వారా వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకున్న‌ది. కానీ ఆ చ‌రిత్రాత్మ‌క ప్ర‌యోగం వాయిదా ప‌డింది.  


logo