మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 14:58:43

ఉల్కల వాన.. ఊరోళ్ల ఆర్థిక అవసరాలు తీర్చింది..!

ఉల్కల వాన.. ఊరోళ్ల ఆర్థిక అవసరాలు తీర్చింది..!

రియోడిజనీరో: ఆ పట్టణంలో చాలామంది రైతులే. ఎవరికీ వ్యాపారాలు లేవు. కొవిడ్‌ మూలంగా కొన్నిరోజుల నుంచి ఎలాంటి పనిచేయడం లేదు. ఉద్యోగాలు లేవు. ఇలాంటి సమయంలో ఆకాశం నుంచి కురిసిన ఉల్కల వాన వాళ్ల ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చేసింది. ఈశాన్య బ్రెజిల్‌లోని మారుమూల పట్టణం అయిన శాంటా ఫిలోమెనాలో ఇటీవల ఉల్కలు వర్షంలా పడ్డాయి. ఇది చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్చపోయారు. ఒక్కొక్క ఉల్క విలువ 26,000 డాలర్ల  వరకు ఉంటుంది. అలాంటివి వంద ఉల్కలు పడ్డాయి. ఇంకేం ఆ పట్టణవాసులకు పైసలే పైసలు..

ఉల్కలకు పైసలకు గల సంబంధం ఏంటి?

ఉల్కలు అంటే అంతరిక్షం నుంచి పడే చిన్న శిలలు. ఇవి సౌర వ్యవస్థ ప్రారంభం నాటి 4.6 బిలియన్ సంవత్సరాల పురాతన ఉల్కలో భాగమని నమ్ముతారు. అయితే, ఈ ఉల్కలలో ఒక శాతం మాత్రమే ఈ రకానికి చెందినవి ఉంటాయి. వీటిపై పరిశోధన వీటిని అంతరిక్ష ప్రయోగాలు చేసే పరిశోధకులు కొనుక్కుంటారు. వీటి ధర గ్రామునకు 40 రియల్స్ ఉంటుంది. అది డిమాండ్‌ను బట్టి పెరుగుతూ ఉంటుంది. 40 కిలోల ఉల్కను కొనగలిగే బ్రెజిలియన్లు చాలా మంది లేరు. దీంతో విదేశీ లక్షాధికారులు వాటిని తీసుకెళ్లడానికి కొనుగోలు చేస్తున్నారు. శాంటా ఫిలోమెనాలో ఒకటి 40 కిలోల కంటే ఎక్కువ బరువు,  26,000 డాలర్ల విలువగల ఉల్క కూడా ఉందట.  ఇక్కడ పడ్డ ఉల్కలు కొండ్రైట్ రకానికి చెందినవని, భూమికి ముందు సౌర వ్యవస్థలో ఏర్పడిన మొదటి ఖనిజాలలో ఒకటని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ తెలిపాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo