బుధవారం 27 మే 2020
International - Apr 09, 2020 , 17:34:00

ఎగిరిన సోయేజ్‌16.. అంత‌రిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమ‌గాములు

ఎగిరిన సోయేజ్‌16.. అంత‌రిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమ‌గాములు

హైద‌రాబాద్‌: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక‌వైపు క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్నా.. ర‌ష్యా మాత్రం సోయేజ్ ఎంఎస్‌-16 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప‌రీక్షించింది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు వెళ్తున్న ఆ వ్యోమ‌నౌక‌లో ముగ్గురు వ్యోమ‌గాముల ఉన్నారు.  క‌జ‌కిస్తాన్‌లోని  బైక‌నూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప‌రీక్ష చేప‌ట్టారు. సోయేజ్‌16లో ర‌ష్యా కాస్మోనాట్స్ ఆంటోలి ఇవానిషిన్‌, ఇవాన్ వాగ్న‌ర్‌తో పాటు అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్ క్రిస్ కాసిడీలు ఉన్నారు.  భ‌మి మీద ఉన్న సురిక్ష‌త‌మైన ప్రాంతానికి వెళ్తున్న‌ట్లు ఇవానిషిన్ తెలిపాడు.  మ‌రికొన్ని నెల‌ల పాటు అంత‌రిక్ష కేంద్రం అత్యంత సుర‌క్షితంగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు.  1961లో క‌జ‌కిస్తాన్ రాకెట్ కేంద్రం ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి అ్క‌డ 400 ఫ్ల‌యిట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  ఎక్స్‌ప‌డీష‌న్ 62 ద్వారా ముగ్గురు వ్యోమ‌గాముల్ని అంత‌రిక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. 


logo