శనివారం 30 మే 2020
International - Apr 16, 2020 , 15:40:46

ద‌క్షిణకొరియాలో అధికార పార్టీ ఘ‌న విజ‌యం

ద‌క్షిణకొరియాలో అధికార పార్టీ ఘ‌న విజ‌యం

న్యూఢిల్లీ: దక్షిణకొరియా జాతీయ అసెంబ్లీ  (పార్లమెంట్‌) ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఘన విజయం సాధించింది. దక్షిణకొరియా జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకారం.. మొత్తం 300 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో అధికార డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 180 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష యునైటెడ్ ఫ్యూచర్ పార్టీ (UFP) కేవలం 103 సీట్లకు ప‌రిమితం అయ్యింది. దేశంలోని మొత్తం 300 పార్ల‌మెంట్ స్థానాల‌కుగాను 21 పార్టీలకు చెందిన 1,400 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 

కాగా, కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అధికారపార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపారని, దీంతో మరోసారి అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ నేతృత్వంలోని అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్‌ కొరియాకే ప్రజలు పట్టం కట్టారని విశ్లేషకులు అంటున్నారు. చైనా తర్వాత దక్షిణకొరియాలోనే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందింది. అయితే, దక్షిణకొరియా ప్ర‌భుత్వం వేగంగా స్పందించి మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో విజ‌యం సాధించింది. అందుకే ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 10,613 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 229 కరోనా మరణాలు సంభ‌వించాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo