బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 13:45:21

దక్షిణ కొరియాలో పార్లమెంట్‌ ఎన్నికలు.. మళ్లీ మూన్‌కే అధికారం!

దక్షిణ కొరియాలో పార్లమెంట్‌ ఎన్నికలు.. మళ్లీ మూన్‌కే అధికారం!

హైదరాబాద్‌: దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ భయం మధ్య ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్ద వేచిఉన్నారు. దేశంలోని మొత్తం 300 జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌) స్థానాలకు 21 పార్టీలకు చెందిన 1,400 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు 53 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కోటీ 10 లక్షలకు పైగా జనాభా ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

అయితే అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ నేతృత్వంలోని అధికార డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ కొరియా మరోమారు అధికారంలోకి రానున్ననది సర్వేలు పేర్కొన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అధికారపార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెల్లడించాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 10,500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,400 మంది వైరస్‌నుంచి కోలుకున్నారు.   

కరోనా వైరస్‌ నేపథ్యంలో శ్రీలంక, యూకే, ఫ్రాన్స్‌, ఇథియోపియాతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 దేశాలు ఎన్నికలను వాయిదావేశాయి. 


logo