శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 15, 2020 , 10:07:55

ద‌క్షిణ కొరియాలో ఎన్నిక‌లు.. మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధ‌రించిన‌ ఓట‌ర్లు

ద‌క్షిణ కొరియాలో ఎన్నిక‌లు.. మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధ‌రించిన‌ ఓట‌ర్లు

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్నా.. ద‌క్షిణ కొరియా మాత్రం జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ది.  ఇవాళ అక్క‌డ ఓట‌ర్లు భారీ సంఖ్య‌లోనే పోలింగ్ బూత్‌కు చేరుకుంటున్నారు.  మాస్క్‌లు, ప్లాస్టిక్ గ్లౌజ్‌లు ధ‌రించి.. ఓట్లు వేస్తున్నారు. పోలింగ్ బూత్‌కు వ‌చ్చిన వారికి మొద‌ట టెంప‌రేచ‌ర్ చెక్ చేస్తున్నారు.  37.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిన‌వారిని ప్ర‌త్యేక బూత్‌ల‌కు తీసుకువెళ్లి ఓటింగ్ జ‌రిపిస్తున్నారు. బూత్ వ‌ద్ద ప్ర‌తి ఓట‌రు ఒక మీట‌రు దూరంలో నిల‌బ‌డాల్సి ఉంటుంది. చేతుల‌ను డిస్ఇన్‌ఫెక్ట్ చేసిన త‌ర్వాతే.. ఓటు వేసే వీలు క‌ల్పిస్తారు. అది కూడా ప్లాస్టిక్ గ్లౌజ్‌లు ధ‌రించాల్సి ఉంటుంది.

మొత్తం 300 సీట్ల కోసం జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. 35 పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో రిజిస్ట‌ర్ చేసుకున్నాయి. కానీ ప్ర‌ధానంగా మిన్‌జూ(డెమోక్ర‌టిక్‌) పార్టీ ఈ ఎన్నిక‌ల్లో ముందంజ‌లో ఉన్న‌ది.  క‌న్జ‌ర్వేటివ్ యునైటెడ్ ఫ్యూచ‌ర్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాలో పోటీ చేస్తున్న‌ది. ఇప్ప‌టికే కోటి మంది త‌మ ఓటును అడ్వాన్స్‌గానే వినియోగించుకున్నారు.  శుక్ర‌, శ‌నివారాల్లోనూ కొన్ని చోట్ల పోలింగ్ జ‌రిగింది. కొంద‌రు పోస్టు ద్వారా, కొంద‌రు మెయిల్ ద్వారా ఓట్లేశారు. 

1952లో జ‌రిగిన కొరియా యుద్ధం స‌మ‌యంలోనూ ద‌క్షిణ కొరియా ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ట్లు రికార్డు ఉన్న‌ది.  దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఎన్నిక‌ల‌ను చేప‌ట్టారు. వైర‌స్ సోకి క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్న‌వారికి కూడా ఓటు వేసే వెస‌లుబాటు చేశారు. కేవ‌లం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంట‌ల‌కు వ‌ర‌కు మాత్ర‌మే వాళ్లు ఓటు వేయాలి. అది కూడా ఇంటి నుంచి బూత్‌కు న‌డుచుకుంటూ లేదా స్వంత కారులోనే రావాలి. ఒక‌వేళ ఎవ‌రైనా నియమం త‌ప్పితే, వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ది.logo