బుధవారం 03 జూన్ 2020
International - Apr 13, 2020 , 06:15:54

దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదం

దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదం

కరోనా కాటుతో దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదమున్నదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు కేవలం 1.8 నుంచి 2.8 శాతం మధ్యే పరిమితం కావచ్చని అంచనా వేసింది. గత 40 ఏండ్లలో ఇదే అత్యల్ప వృద్ధిరేటని తెలిపింది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు ఉన్నాయి. 

ఈ ఏడాది దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండవచ్చని గతేడాది అక్టోబర్‌లో అంచనా వేసింది. కానీ కరోనా సంక్షోభం ముంచుకురావడంతో ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు తన అంచనాను గణనీయంగా కుదించింది. ఈసారి చైనా జీడీపీ కూడా దారుణంగా క్షీణిస్తుందని పేర్కొన్నది. ప్రపంచ జీడీపీలో 16 శాతంగా ఉన్న చైనా వాటా ఇప్పటికే 6 శాతానికి పడిపోయింది. మున్ముందు ఇది 5 శాతానికి దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.logo