సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 15, 2020 , 21:22:46

'జెరూసలేమా'.. ఈ పాటకు 230 మిలియన్‌ వ్యూస్‌..!వీడియో

'జెరూసలేమా'.. ఈ పాటకు 230 మిలియన్‌ వ్యూస్‌..!వీడియో

జోహెన్నస్‌బర్గ్‌: ఇప్పుడందరికీ ‘జెరూసలేమా’ ఫీవర్‌ పట్టుకుంది. ఈ పాట ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ దక్షిణాఫ్రికా పాటకు ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 230 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. దీంతో ఇది గ్లోబల్‌ లాక్‌డౌన్‌ హిట్‌గా నిలిచింది. జూలూ సాహిత్యంతో రాసిన 'జెరూసలేమా'.. సువార్త ప్రభావిత పాట. కరోనా వైరస్‌ వల్ల ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఈ పాట విడుదలైంది. దీన్ని ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న ప్రజలు ఆదరించారు. దీంతో ఇంత హిట్‌ సాధించింది.

‘జెరూసలేం నా ఇల్లు, నన్ను కాపలాగా ఉంచండి, నాతో నడవండి, నన్ను ఇక్కడ వదిలివేయవద్దు.. జెరూసలేం నా ఇల్లు, నా స్థలం ఇక్కడ లేదు.. నా రాజ్యం ఇక్కడ లేదు.. అంటూ పాట సాగుతుంది.  దీనిని మాస్టర్ కేజీగా ప్రసిద్ధి చెందిన క్గాగోజెలో మోగి అనే దక్షిణాఫ్రికా సంగీతకారుడు ఆలపించాడు. అతడు ఈ పాటను మరొక గాయకుడు నోసెంబో జికోడ్‌తో కలిసి రాశాడు. ఈ పాటలోని డ్యాన్స్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలామంది ఈ స్టెప్పులను అనుకరిస్తూ ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. ఇది నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అయ్యింది. ఆన్‌లైన్‌లో ‘జెరూసలేమా డ్యాన్స్‌ చాలెంజ్‌’ కూడా నిర్వహించారు. ఈ ఏడాది ఎంటీవీ యూరోపియన్ మ్యూజిక్ అవార్డులలో ఇది ఉత్తమ పాటగా ఎంపికైంది.  ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం నేపథ్యంలో ఈ పాట రాశారు. పాలస్తీనా యువకులు ఏం కోరుకుంటున్నారో ఇందులో ఉంటుంది. ఇజ్రాయెల్ ఆక్రమించిన తూర్పు జెరూసలేం తమ ఇల్లు అంటూ వారు పాట పాడతారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.