బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 19:08:55

ప్ర‌జాప్ర‌తినిధుల వీడియోకాన్ఫ‌రెన్స్‌లో పోర్న్ దృశ్యాలు..

ప్ర‌జాప్ర‌తినిధుల వీడియోకాన్ఫ‌రెన్స్‌లో పోర్న్ దృశ్యాలు..

హైద‌రాబాద్‌: ద‌క్షిణాఫ్రికాలో పార్ల‌మెంట్‌ ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పోర్న్ వీడియోలు టెన్ష‌న్ పుట్టించాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా పార్ల‌మెంట్ స‌భ్యులు.. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్ థండి మోడిసి వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. అక‌స్మాత్తుగా వీడియోకాన్ఫ‌రెన్స్‌లో అశ్లీల వీడియోలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. వీడియోకాన్ఫ‌రెన్స్ హ్యాక్ చేసిన వారు స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేశారు.  అస‌భ్య‌క‌ర‌మైన దృశ్యాలు వీడియోకాన్ఫ‌రెన్స్‌లో క‌నిపించ‌డంతో స్పీక‌ర్ థండీ షాక‌య్యారు. జూమ్ ప్లాట్‌ఫాంలో జ‌రుగుతున్న స‌మావేశంలో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో పార్ల‌మెంట్ స‌భ్యులు మ‌రో లింక్‌లో త‌మ స‌మావేశాల‌ను కొన‌సాగించారు. జూమ్ ప్లాట్‌ఫాంపై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే.  హ్యాక‌ర్లు అనుచిత దృశ్యాలు పోస్టు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

 logo