బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 11:49:57

కరోనా కేసులు.. ప్రపంచంలో ఐదో స్థానానికి సౌతాఫ్రికా

కరోనా కేసులు..  ప్రపంచంలో  ఐదో స్థానానికి సౌతాఫ్రికా

 జోహన్నెస్‌బర్గ్‌: ఆఫ్రికా ఖండంలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది.  కరోనా మహమ్మారి దెబ్బకు సౌతాఫ్రికా దేశం వణికిపోతోంది.   దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య  4 లక్షలకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా  కరోనా కేసుల్లో  దక్షిణాఫ్రికా    తాజాగా ఐదో స్థానానికి చేరింది. 

శనివారం ఒక్కరోజే  కొత్తగా 13,285 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా  దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  3, 50,879కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా బాధితులు  అమెరికా(3,833,271),బ్రెజిల్‌(2,075,246), భారత్‌(1,077,864), రష్యా(765,437) దేశాల్లోనే ఉన్నారు.

50శాతానికి పైగా కేసులు ఈ నాలుగుదేశాల్లోనే నమోదయ్యాయి.  సౌతాఫ్రికా తర్వాత పెరూ(349,500), మెక్సికో(338,913), చిలీ(328,846), స్పెయిన్‌(307,335) దేశాల్లో కరోనా తీవ్రత  ఎక్కువగా ఉన్నది. 


logo