e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News మ‌హిళ‌కు ఒక‌రి కంటే ఎక్కువ మంది భర్త‌లు.. చ‌ట్టం చేయ‌నున్న సౌతాఫ్రికా!

మ‌హిళ‌కు ఒక‌రి కంటే ఎక్కువ మంది భర్త‌లు.. చ‌ట్టం చేయ‌నున్న సౌతాఫ్రికా!

కేప్‌టౌన్‌: ఒక మ‌గాడికి ఒక‌రి కంటే ఎక్కువ మంది భార్య‌లు అన్న‌ది స‌హ‌జం. ప్ర‌పంచంలో ప‌లు స‌మాజాలు, మ‌తాలు స‌మ్మ‌తించిన అంశం. కానీ ఓ మ‌హిళకు ఒక‌రి కంటే ఎక్కువ మంది భ‌ర్త‌లు అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ చాలా మంది అంగీక‌రించ‌ని, జీర్ణించుకోలేని విష‌యం. అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌మూహాల్లో ఈ బ‌హుభ‌ర్తృత్వాన్ని పాటిస్తున్నా.. ఈ సంస్కృతిని చ‌ట్ట‌బ‌ద్ధం చేసిన దాఖ‌లాలు లేవు. కానీ ఇప్పుడు ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తోంది సౌతాఫ్రికా.

స‌మాన‌త్వం కోస‌మే..

- Advertisement -

సౌతాఫ్రికా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ బ‌హుభ‌ర్తృత్వం అనే ప్ర‌తిపాద‌న చేసింది. స‌మాన‌త్వం సాధించ‌డానికే ఈ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు కూడా ప్ర‌భుత్వం చెప్పుకుంటోంది. అయితే దీనిపై ఇప్పుడు దేశ‌మంతా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌పంచంలోని అత్యంత ఉదార‌వాద రాజ్యాంగాల్లో సౌతాఫ్రికాది కూడా ఒక‌టి. అక్క‌డ ఇప్ప‌టికే స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంది. పురుషులు ఒక‌రి కంటే ఎక్కువ మందిని పెళ్లాడే స్వేచ్ఛ ఉంది. అదే అవకాశం మ‌హిళ‌ల‌కూ ఇవ్వాల‌ని హక్కుల కార్య‌క‌ర్త‌లు కొన్నాళ్లుగా ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. స‌మాన‌త్వం ఇలాగే సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది వారి వాద‌న‌.

వారి వాద‌న‌ను ప్ర‌భుత్వ‌మూ స‌మ‌ర్థిస్తోంది. బ‌హుభ‌ర్తృత్వాన్ని చ‌ట్ట‌బ‌ద్ధం చేసి త‌మ వివాహ వ్య‌వ‌స్థ పురుషులు, మ‌హిళ‌ల‌కు ఒకేలా ఉంటుంద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే అక్క‌డి హోంమంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే ఓ గ్రీన్ పేప‌ర్‌ను ప‌బ్లిష్ చేసింది. వివాహ చ‌ట్టానికి తీసుకురావాల‌ని అనుకుంటున్న ఈ సంస్క‌ర‌ణ‌ను అక్క‌డి సాంప్ర‌దాయ‌వాదులు, ప‌లు మ‌తాల పెద్ద‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

వ్య‌తిరేక‌త ఎందుకు?

బ‌హుభ‌ర్తృత్వాన్ని ప‌లు కార‌ణాలు చెబుతూ అక్క‌డి కొన్ని సంఘాలు వ్య‌తిరేకిస్తున్నాయి. న‌లుగురు భార్య‌లు ఉన్న మూసా సెలేకు అనే ఓ టీవీ ప్ర‌ముఖుడు ఈ ప్ర‌తిపాద‌న‌ను త‌ప్పుబ‌డుతున్నాడు. ఇది ఆఫ్రికా సంస్కృతిని నాశ‌నం చేస్తుంది. వారి పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటి? వాళ్ల‌కు గుర్తింపు ఎలా వస్తుంది? ఓ మ‌హిళ పురుషుడి పాత్ర‌ను పోషించ‌లేదు. ఇది ఎప్పుడూ విన‌న‌ది. ఓ పురుషుడు ఆ మ‌హిళ ఇంటిపేరును పెట్టుకుంటాడా అని ప్ర‌శ్నించాడు.

అటు ఆఫ్రిక‌న్ డెమొక్ర‌టిక్ పార్టీ నేత కెన్నెత్ మీషూ కూడా దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. బ‌హుభార్య‌త్వాన్ని అంద‌రూ అంగీక‌రిస్తారు. కానీ బ‌హుభ‌ర్తృత్వాన్ని కాదు. ఇది వ‌ర్క‌వుట్ కాదు అన్న‌ది ఆయ‌న వాద‌న‌. ఇక ఇస్లామిక్ అల్‌-జ‌మా పార్టీ నేత గ‌నీఫ్ హెండ్రిక్స్ దీనిపై స్పందిస్తూ.. ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ తండ్రి ఎవ‌రో తెలుసుకోవ‌డానికి డీఎన్ఏ టెస్టులు చేయాల్సి వ‌స్తుంది అని అన్నారు.

వాద‌న‌లు.. ప్ర‌తివాద‌న‌లు

ఇప్ప‌టికే త‌మ ప్ర‌తిపాద‌న‌పై హోంమంత్రిత్వ శాఖ వివిధ వ‌ర్గాలు, పార్టీల నేత‌లు, మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లతో చ‌ర్చ‌లు జ‌రిపింది. అక్క‌డి పార్టీల నేత‌లు, మ‌త పెద్ద‌లు మాత్రం ఇది ఆఫ్రికా సంస్కృతికి స‌రిప‌డనిద‌ని వాదిస్తున్నారు. మ‌రోవైపు మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు మాత్రం బ‌హుభ‌ర్తృత్వాన్ని కూడా పెళ్లిగా గుర్తించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అలాగే స‌మాన‌త్వాన్ని సాధించ‌గ‌ల‌మ‌ని వాదిస్తున్నారు.

ఈ గ్రీన్ పేప‌ర్ బ‌హుభ‌ర్తృత్వాన్నే కాకుండా ప్ర‌స్తుతం చ‌ట్టంలోని కొన్ని లోపాల‌ను స‌వ‌రించాల‌ని కూడా ప్ర‌తిపాదించింది. మైన‌ర్ల‌ను పెళ్లి చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌డం వంటి వాటిని పునఃస‌మీక్షించాల‌ని భావిస్తున్నారు. ఇక అక్క‌డి హిందూ, ముస్లిం, యూదుల పెళ్లిళ్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ గుర్తింపు క‌ల్పించాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా ఇందులో ఉంది. దీనిని ఈ క‌మ్యూనిటీలు స్వాగ‌తించాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana