మంగళవారం 26 మే 2020
International - Apr 02, 2020 , 22:32:53

ఇట‌లీకి సారీ చెప్పిన ఈయూ

ఇట‌లీకి సారీ చెప్పిన ఈయూ

లంక్సంబర్గ్: క‌రోనా మ‌హ‌మ్మారికి ఇట‌లీ చిగురుటాకుల వ‌ణికిపోతుంది. కోవిడ్‌-19 వైర‌స్‌తో అత్య‌ధికంగా మ‌ర‌ణాలు ఆదేశంలోనే సంభ‌వించాయి. అయితే కరోనా సంక్షోభ స‌మ‌యంలో ఇటలీకి చేయాత నివ్వ‌నందుకు యూరోపియన్ యూనియన్ చీఫ్ క్షమాపణలు చెప్పారు. ఈయూ చీఫ్ వాన్ డర్ లియన్ ఇటలీకి చెందిన దినపత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదిలోనే తాము ఇట‌లీకి సాయంగా లేమ‌ని... ప్ర‌స్తుతం మాత్రం ఈయూ ఇటలీకి బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు.   ఇటలీకి బాసటగా ఈయూ దేశాలన్ని ఒక్కతాటిపైకి రాలేకపోయాయని దీనికి గ‌ల కార‌ణాలు.. తమ ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పూర్తిగా ఆయా దేశాలు ఉన్నాయ‌ని  వ్యాఖ్యానించారు. 


logo