శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 17:14:52

పారిస్‌వాసులను భయపెట్టిన భారీ శబ్ధం

పారిస్‌వాసులను భయపెట్టిన భారీ శబ్ధం

పారిస్‌లో భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి. పేలుడు శబ్దాలు పారిస్ అంతటా వినిపించాయి. పేలుడు శబ్దాల కారణంగా పారిస్ అంతటా భయాందోళన వాతావరణం నెలకొన్నది. జెట్‌ ఫైటర్ల నుంచే ఈ శబ్ధాలు వచ్చాయని కొందరు చెప్తుండగా.. బాంబు దాడి జరిగినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం బాంబు దాడి జరుగలేదని స్పష్టంచేస్తున్నారు. మిలజరీ జెట్‌ నుంచి వచ్చిన సోనిక్‌ బూమ్‌ కారణంగా అలాంటి శబ్ధం వినిపించిందని ఫ్రెంచ్‌ పోలీసులు ధ్రువీకరించారు. ఏమి జరిగిందో, ఏమి పేలిందో తెలుసుకోవడానికి స్థానికులు ఉత్సాహం చూపుతున్నారు. 

భారీ శబ్దం పారిస్ నివాసితులను భయభ్రాంతులకు గురిచేసింది. ఫ్రెంచ్ రాజధానిలో నెటిజన్లను సోషల్ మీడియా వార్తలు గందరగోళంలోనికి నెట్టాయి. "పారిస్ ప్రాంతంలో చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఇది పేలుడు కాదు. ఇది సౌండ్ అడ్డంకిని దాటిన ఫైటర్ జెట్" అని పారిస్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అత్యవసర ఫోన్ లైన్లకు కాల్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. భారీ శబ్దం రావడంతో భవనాలు కదిలాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పలు వార్తలు వచ్చాయి. నగరంలో ఎటువంటి పొగ లేదా మంటలు కనిపించినట్లు కూడా దాఖలాలు లేవు. పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఆటగాళ్లను ఈ పేలుడు శబ్ధం కొన్ని నిమిషాలపాటు ఆడకుండా నిలిపివేసింది. 


logo