మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 19:19:34

ఖ‌ర్చుల‌కు డబ్బు ఇవ్వ‌ట్లేద‌ని త‌ల్లిదండ్రుల త‌ల‌ల‌ను న‌రికి గ్రైండ‌ర్‌లో..

ఖ‌ర్చుల‌కు డబ్బు ఇవ్వ‌ట్లేద‌ని త‌ల్లిదండ్రుల త‌ల‌ల‌ను న‌రికి గ్రైండ‌ర్‌లో..

ఈ రోజుల్లో పిల్ల‌ల‌ను ఒక‌మాట అన‌డానికి కూడా వీలు లేకుండా పోయింది. చ‌దువుకోమ‌ని అరిచినందుకు ఇంట్లో దొరికిన ప్ర‌మాద‌క‌ర మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం. ఫోన్‌లో గేమ్స్ ఆడొద్ద‌ని మంద‌లిస్తే సూసైడ్. ఇలా మంచి చెప్పినా వారికి అవి తిట్లులా అనిపిస్తున్నాయి. ఇలాంటి పిల్ల‌లు ఒక‌ర‌కం అయితే.. ఓ కొడుకు  మాత్రం క‌నిక‌రం లేకుండా త‌ల్లిదండ్రుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్నాడు. కొరివి పెట్టాల్సిన త‌ల‌ల‌ను ఉడ‌క‌పెట్టేశాడు. ఇక మిగిలిన శ‌రీరంలోని భాగాల‌ను  గ్రైండ‌ర్‌లో వేసి నుజ్జు నుజ్జు చేశాడు. ఇత‌ను ఈ ప‌ని ఎందుకు చేశాడో తెలిస్తే భ‌య‌ప‌డుతారు.

నాక్స్విల్లే‌కు చెందిన జోయ‌ల్ గ‌య్ సీనియ‌ర్‌, లిసాల‌కు జోయ‌ల్ గ‌య్ జూనియ‌ర్ అనే 32 ఏండ్ల కొడుకున్నాడు. ఇన్నేండ్లు వ‌చ్చినా జీవితంలో కొడుకు స్థిర‌ప‌డ‌కుండా జులాయిగా తిరుగుతున్నాడు. అందుకు త‌ల్లిదండ్రులు ఇక ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బు ఇచ్చేది లేదు, నువ్వే సంపాదించుకోవాల‌ని హెచ్చ‌రించారు. దీంతో కోపానికి గురైన జోయ‌ల్ వారితో గొడ‌వ ప‌డ్డాడు. వీరిని చంపితే రూ. 3. 68 కోట్ల‌ ఆస్తి త‌న‌కే వ‌స్తుంద‌ని ఒక ప్లాన్ వేశాడు. త‌ల్లి ఇంట్లోలేని స‌మ‌యంలో తండ్రిని క‌త్తితో పొడిచి చంపాడు. అప్పుడే ఇంటికి వ‌చ్చిన త‌ల్లిని కూడా క‌త్తితో పొడిచి చంపాడు. తండ్రిని 40 సార్లు క‌త్తితో పొడ‌వ‌గా, త‌ల్లిని 30 సార్లు పొడిచి చంపాడు. త‌ర్వాత రెండు త‌ల‌ల‌ను న‌రికి కుండ‌లో పెట్టి నీరు పోసి ఉడికించాడు. క‌త్తులు, సుత్తులు ఉప‌యోగించి శ‌రీరాన్ని ముక్క‌లు చేసి గ్రైండ‌ర్‌లో వేసి రుబ్బాడు. మ‌రుస‌టి రోజు త‌ల్లి లీసా ఆఫీసుకు వెళ్ల‌లేదు.

దీంతో స‌హోద్యోగులు ఆమెకు ఫోన్ చేసినా ఫ‌లితం లేక‌పోయింది. అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాని చేరుకొని జోయ‌ల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాస్త లేట్ అయింటే జోయ‌ల్ త‌ల్లిదండ్రుల బాడీ పార్ట్స్‌ని యాసిడ్‌లో ముంచేవాడు. దీంతో ఒక్క ఆధారం కూడా దొరికేది కాదు. అయితే ఈ సంఘ‌ట‌న ఇప్పుడు జ‌రిగింది కాదు. 2016లో చోటు చేసుకున్న‌ది. ఈ హ‌త్య‌ల‌ను తాను చేయ‌లేద‌ని జోయ‌ల్ చెప్ప‌డంతో గ‌త నాలుగేండ్లుగా కేసు విచార‌ణ జ‌రుగుతూనే ఉంది.  నిన్న సోమ‌వారం  నాక్స్విల్లే కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చి వాయిదా ప‌డింది. హ‌త్య చేసిన వివ‌రాల‌ను ప్రాసిక్యూటర్ లిస్లీ నస్సాస్ కోర్టుకు తెలిపింది. ఇంత ఘోర‌మైన హ‌త్య‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదంటూ డిటెక్టీవ్ జెరేమీ మెక్‌కార్డ్ చెప్పుకొచ్చారు. logo