ఫైజర్ వ్యాక్సిన్ ఓకే.. కానీ ఉత్పత్తి సంగతేంటి?

వాషింగ్టన్: కరోనా నివారణకు ప్రముఖ ఫార్మా కంపెనీ ‘ఫైజర్’ రూపొందించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు వినియోగంలోకి తేవడంలో అనూహ్య సమస్యలు ప్రత్యేకించి ఉత్పాదకత సవాళ్లు పొంచి ఉన్నాయి. దీంతోపాటు కోల్డ్ స్టోరేజీ అంశం కూడా సమస్య కానుందని అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి అలెక్స్ అజర్ బుధవారం అభిప్రాయ పడ్డారు.
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను మైనస్ 80 సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుందని అమెరికా ఆర్మీ జనరల్ గుస్టేవ్ పెమా చెప్పారు. బయో ఎన్ టెక్ ఎస్ఈ భాగస్వామ్యంతో ఫైజర్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను సుమారు మైనస్ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. స్టోరేజీకి అవసరమైన ఉష్ణోగ్రత దాని భద్రత, సామర్థ్యానికి ముప్పుగా మారుతుందా? అన్న సందేహాలు ఉన్నాయి.
అమెరికన్లకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడానికి దాని ఉత్పత్తిదారులకు పూర్తి మద్దతునందిస్తామని అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ వెల్లడించారు. అందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించాల్సి ఉందన్నారు. ఫైజర్ దీనిపై స్పందించకున్నా.. దేశీయ అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు డిఫెన్స్ ఉత్పాదక చట్టాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థ సీఈవో అల్బర్ట్ బౌర్లా గతవారం కోరారు. దీనిపై తదుపరి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం!
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గన్ సెల్యూట్